తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరు సబ్‌డివిజన్ పరిధిలోని ప్రజలు వేసవి కాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ బాలసుబ్రమణ్యం సూచించారు. సోమవారం తన కార్యాలయంలో దొంగతనాల నివారణకు సంబంధించిన అవగాహన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వేసవి కాలంలో ఇళ్లలో చోరీలు, స్నాచింగ్‌లు, మోటార్‌సైకిల్ దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు ఊరికి వెళ్లే సమయంలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లాలని, నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంకుల్లో లేదా నమ్మకమైన వారి వద్ద భద్రపరచాలని సూచించారు.ఇళ్ల వద్ద, ముఖ్య ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే అనుమానాస్పద వ్యక్తులను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. మోటార్‌సైకిళ్లను రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వదిలేయకుండా, సాధ్యమైనంతవరకు ఇంటి ఆవరణలో భద్రంగా ఉంచాలని సూచించారు. వాహనాలకు తప్పనిసరిగా తాళాలు వేసి, అదనపు భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు.వేసవి సెలవుల్లో పిల్లలు చెరువులు, నీటి గుంటల వద్దకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ హెచ్చరించారు. లోతు తెలియని చెరువులు, గుంటల్లో ఈతకు వెళ్లడం ప్రాణాపాయానికి దారితీస్తుందని, పిల్లలకు ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ అన్వర్ భాష కందుకూరు టౌన్ కందుకూరు రూరల్ ఉలవపాడు పులి శివ నాగరాజు బాలకృష్ణ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *