తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

వై.పాలెం సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) ఆధ్వర్యంలో నేర సమీక్షా సమావేశం (Crime Review Meeting) నిర్వహించబడింది. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ప్రగతిని సీఐ సమీక్షించారు. ముఖ్యంగా సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఇన్వెస్టిగేషన్ (UI) కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని, కోర్టు ద్వారా జారీ అయిన నాన్-బెయిలబుల్ వారెంట్లను (NBWs) వెంటనే అమలు చేసి నిందితులను పట్టుకోవాలని అధికారులకు మరియు సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశారు. నేరాల నియంత్రణలో అలసత్వం వహించరాదని, ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వై.పాలెం ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ , సర్కిల్ ఎస్సై లు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *