తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు, యర్రగొండపాలెం సీఐ, పొదిలి సీఐ , చీమకుర్తి సీఐ పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి శనివారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.ఈ కార్డన్ & సెర్చ్‌లో భాగంగా ఆయా ప్రాంతాల్లోని అనుమానిత వ్యక్తులు, పాత నేరస్తుల నివాసాలు, గ్రామ శివారులు, ముఖ్య కూడళ్లు, పలు దుకాణాల్లో డ్రోన్ కెమెరాల సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల సమయంలో సరైన పత్రాలు లేని బైకులు, వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా పోలీస్ శాఖ తరచుగా నిర్వహించే కార్డన్ & సెర్చ్ ఆపరేషన్లకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని పోలీస్ అధికారులు కోరారు. తమ ప్రాంతాల్లో చట్ట వ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు లేదా అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112 / 100 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్డన్ & సెర్చ్ ఆపరేషన్‌లో సీఐలు, ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *