తొలి శుభోదయం న్యూస్ దర్శి:-

దర్శి మండలం శామంతపూడి గ్రామంలో నిర్వహించిన “రైతన్న మీకోసం” కార్యక్రమానికి దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. “అన్నదాత సుఖీభవ” పథకం ద్వారా ఒక్కో రైతుకు రూ.20,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు.పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని వెల్లడించారు.హార్టికల్చర్ పంటలకు ప్రోత్సాహంగా ఎకరాకు లక్ష రూపాయల వరకు సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *