తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
శ్రీ గాయిత్రి విద్యాసంస్థల ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయిని శ్రీమతి ఆర్. నీలుకుమారి అధ్యక్షతన అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించబడినది. ప్రధాన వక్తగా తెలుగు ఉపాధ్యాయులు శ్రీ ఇనకొల్లు మస్తానయ్య ఫిబ్రవరి 21న మాతృ భాషా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాల్సివచ్చినది, మాతృభాష యొక్క ప్రాధాన్యతను వివరించినారు. అలాగే జి5 ప్రధానోపాధ్యా యిని ముప్పవరపు అనుపమ, తెలుగు ఉపాధ్యాయిని యు. నవకుమారి , విశ్రాంత ఉపాధ్యాయులు యలమందారావు అమ్మ భాష ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించినారు. ఈ సందర్బంగా శ్రీ గాయిత్రి విద్యాసంస్థల యాజమాన్యం కరస్పాండెంట్ &ఛైర్మెన్ శ్రీ సి.హెచ్. రామకృష్ణా రావు , మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సి.హెచ్. భరద్వాజ్ తెలుగు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించినారు. తెలుగు తల్లి వేష ధారణలో విద్యార్థులు తెలుగుజాతి గొప్పతనాన్ని తెలిపే గానానికి నృత్యం మరియు శతక పద్యాలు రాగయుక్తంగా పాడి సభను అలరించినారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ వెంకటేశ్వర్లు సభా పరిచయం, వందన సమర్పణ చేసినారు.శ్రీ గాయిత్రి విద్యాసంస్థల ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులందరూ పాల్గొని సభను జయప్రదం చేసినారు.
