తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరు పట్టణం గుర్రం వారి పాలెం లోని శ్రీ సంస్కృతి స్కూల్లో ఈరోజు అనగా ఆదివారం పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుకను అత్యంత ఉత్సాహంగా, భావోద్వేగాల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరి అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిలుగా కొంకా లక్ష్మి నరసింహారావు, కొంకా చెంచమ్మ విచ్చేశారు .ఈ సందర్భంగా కొంకా లక్ష్మి నరసింహారావు మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, పాఠశాలకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పదవ తరగతి అనేది విద్యార్థి జీవితంలో ఒక కీలక మలుపనీ ఇక్కడ నేర్చుకున్న విలువలు భవిష్యత్తులో దిశా నిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు.అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. జూనియర్ విద్యార్థులు తమ సీనియర్లకు జ్ఞాపికులను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కొందరు విద్యార్థులు తమ పాఠశాల జ్ఞాపకాలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *