తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

ప్రకాశం జిల్లా , కందుకూరు రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్ దామోదర్ హిమవంశీ ఐఏఎస్ ను భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పెరికే లక్ష్మణ్ సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ దామోదర్ హిమవంశీతో లక్ష్మణ్ మాట్లాడుతూ పొన్నలూరు మండలం గతంలో కనిగిరి రెవిన్యూ డివిజన్ లో ఉండటం వలన సామాన్య ప్రజలు సమస్యలను తెలియజేయుటకు ఆర్ డి ఓ ను కలవడానికి కనిగిరి పోలేక సమస్యలు పరిష్కారం కాక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళని , ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొన్నలూరు మండలాన్ని తిరిగి కందుకూరు రెవిన్యూ డివిజన్ లో కలపడంతో సామాన్య ప్రజలు సమస్యలు పరిష్కారం అవుతాయని చర్చించుకుంటూ ఉండటాన్ని గమనించిన తరువాత చాలా సంతోషంగా ఉందన్నారు. ఏ సమస్యలు ఉన్న నేరుగా నన్ను కలవవచ్చునని సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపుతానని సబ్ కలెక్టర్ దామోదర్ హిమవంశీ చెప్పారని లక్ష్మణ్ మీడియాకు తెలియజేశారు. సబ్ కలెక్టర్ దామోదర్ హిమవంశీ ఐఏఎస్ ను కలిసిన వారిలో నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ మాజీ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే , భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎర్రగుంట్ల శిరీష్ తదితరులు ఉన్నారు……

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *