తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

మురుగుమ్మి గ్రామంలో నిర్వహిస్తున్న ఆదివిపెరంటాలమ్మ తిరునాళ్ల సందర్భంగా భక్తుల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్ కింద ప్రకాశం జిల్లా పోలీసులు డ్రోన్ నిఘా ఏర్పాటు చేశారు. ఈ నిఘా కార్యక్రమం పీసీ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో, ఎస్‌ఐ పర్యవేక్షణలో నిర్వహించబడింది.తిరునాళ్ల ప్రాంగణం, ఆలయ పరిసరాలు, రహదారులు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. డ్రోన్ నిఘాతో పాటు భూమిపై కూడా పోలీసు సిబ్బందిని కీలక ప్రాంతాల్లో మోహరించి జన నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ సమర్థవంతంగా చేపట్టారు.భక్తులు పోలీసుల సూచనలను పాటిస్తూ సహకరించాలని, తిరునాళ్లను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *