తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కందుకూరు పట్టణంలోని బాలుర హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషాన్నిచ్చింది.ఈ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ హిమవంశీ, మున్సిపల్ కమిషనర్ శ్రీమతి కె. అనూష గారు, అధికారులు, నియోజకవర్గ ఆడపడుచులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ సభను విజయవంతం చేశారు.సమాజ గతిని మార్చే శక్తి మహిళలకే ఉందని, ప్రతి రంగంలోనూ వారు సాధిస్తున్న ప్రగతి మనందరికీ గర్వకారణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మహిళల సంక్షేమం, వారి భద్రతకు మన ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తుంది.
ఈ వేడుకల్లో నాతో కలిసి పాల్గొన్న సోదరీమణులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *