తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
చీమకుర్తి సర్కిల్ పరిధిలోని పలు గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలు (బెల్ట్ షాపులు) జరుగుతున్నాయన్న సమాచారంతో చీమకుర్తి సీఐ విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా అనుమానిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించి, బెల్ట్ షాపుల నిర్వాహకులను పిలిపించి గట్టిగా మందలించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గృహాల్లో గానీ, చిన్న దుకాణాల్లో గానీ మద్యం నిల్వ ఉంచి విక్రయిస్తే కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను సహించేది లేదని స్పష్టం చేశారు. బెల్ట్ షాపుల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.