తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

పండుగల నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బాణసంచా తయారీ కేంద్రాలు, స్టోరేజ్ గోడౌన్లు మరియు విక్రయ కేంద్రాలలో పోలీస్ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో భాగంగా ఫైర్ సేఫ్టీ అధికారులు నిర్దేశించిన నిబంధనలను షాపు యజమానులు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించారు. షాపుల్లో అమర్చిన అగ్నిమాపక పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనే అంశాన్ని ప్రత్యక్షంగా చెక్ చేశారు. ఏదైనా అనుకోని ఘటన సంభవించిన సందర్భంలో వెంటనే స్పందించేందుకు నీరు, ఇసుక, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు తదితర అగ్నిమాపక సామాగ్రి సిద్ధంగా ఉంచాలని యజమానులకు సూచించారు.బాణసంచా తయారీ కేంద్రాల్లో గాని, విక్రయ కేంద్రాల్లో గాని 18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో నియమించరాదని స్పష్టంగా తెలియజేశారు. అదేవిధంగా ఫైర్ ఇంజన్ సులభంగా చేరుకునేలా సరైన మార్గం ఉందా లేదా అనే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలించారు.ప్రభుత్వ నియమ నిబంధనలు మరియు పోలీస్ సూచనలను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని బాణసంచా తయారీ కేంద్రాలు, స్టోరేజ్ గోడౌన్లు మరియు విక్రయ కేంద్రాలను నిరంతరం ఆకస్మికంగా తనిఖీలు చేయాలని ఎస్పీ ఆదేశించారు.తనిఖీల నిర్వహణలో పోలీస్ సిబ్బంది అలసత్వం వహించిన పక్షంలో వారిపైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజల భద్రతే పోలీస్ శాఖకు ప్రథమ ప్రాధాన్యత అని అధికారులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *