తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం / సింగరాయకొండ,:-

రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం డెస్టినీగా మార్చడానికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం జిల్లా పాకల రెండవ బీచ్ ఫెస్టివల్ అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు డాక్టర్ డోలా శ్రీబాలాంజనేయ స్వామి,బి.సి.జనార్ధన రెడ్డి, కొల్లు రవీంద్ర, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, మాల కార్పొరేషన్ చైర్మన్ పి. విజయ్ కుమార్, కలెక్టర్ పి.రాజాబాబు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజలకు ఆహ్లాదాన్ని అందించడంపైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం డెస్టినీగా మార్చడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.ఇందులో భాగంగా పాకల బీచ్ ను మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తున్నాం. బీచ్ ఫెస్టివల్ ని పాల్గొని విజయవంతం చేసిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి కృతజ్ఞలు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *