తొలి శుభోదయం న్యూస్ పల్నాడు:-

పల్నాడు జిల్లాలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో భాగంగా వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుంచి జిల్లా రెవిన్యూ అధికారి నారదముని అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 232 అర్జీలు నమోదయ్యాయి.అనంతరం ఆయన జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత పాటించాలని మరియు గడువులోగా అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. శాఖల వారీగా గ్రీవెన్స్‌పై ఆడిట్ నిర్వహించాలని, అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యల తీవ్రతను అర్థం చేసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు పెండింగ్‌ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *