తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:-
అవంతిక గుడ్లూరు అభ్యుదయ స్కూల్ లో 7 వ తరగతి చదువుతున్నది. వీరి తల్లి తండ్రులు దినసరి కూలి చేసుకొనేవారు.14/02/26 వ తేదీ ఎంతో ఉత్సాహంగా వారి పాఠశాల లో జరుగుతున్న వార్షికోత్సవానికి వస్తూ దురదృష్టవశాత్తు మోటార్ సైకిల్ ప్రమాదం జరిగింది.ఆ పాపకు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస తీసుకొంటూ ఒంగోలు ఓ ప్రైవేటు ఆసుపత్రి నందు చికిత్స తీసుకుంటుంది.ఆ పాప తల్లి కూడా గాయలతో ఒంగోల్ రిమ్స్ హాస్పిటల్ లో మతి స్థిమితం కోల్పోయి ఉంది. ఈ పాప తండ్రికి వైద్యఖర్చుకు కూడా ఆర్థిక స్తోమత లేకపోవడంతో.ఆ పాప ఆసుపత్రి ఖర్చులకు ఆర్థిక సహాయం కావాలని గుడ్లూరు కి చెందిన ఎయిర్టెల్ చిన్న ద్వారా మన సొసైటీ ద్రృష్టికి తీసుకువచ్చారు మన సొసైటీ సభ్యులు, మిత్రులు మంచిమనసు తో మానవతా దృక్పధంతో 28000/-ఆర్థిక సహాయం అందించారు. గురువారం ఆ పాప తండ్రి, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ ద్వారా 28000/- చెక్కును వారికి అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆల్ ఇండియా వాసవి సత్ర సముదాయాల మీడియా చైర్మన్ డాక్టర్ చక్కా వెంకట కేశవరావు మాట్లాడుతూ ఇంతక ముందు కూడా ఎంతో మంది పేదల వైద్యానికి సహాయం అందించిన సొసైటీ సభ్యులకు ఈ సందర్భంగా ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరు సేవా హృదయ డాక్టర్ రవ్వా శ్రీనివాసులు, సెక్రటరీ పబ్బిశెట్టి వెంకట సురేష్ (జే ఎం )షేర్స్ ఆఫీస్),ఈ.సి.మెంబర్ ఇన్నమూరి శ్రీనివాసులు, ఎయిర్టెల్ చిన్న,ఇన్నమూరి సుధాకర్ రావు, అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.