తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
అర్థవీడు గ్రామీణ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచుతోంది. ఇందులో భాగంగా అర్థవీడు మండల పరిధిలోని యాచవరం గ్రామ శివార్లలో కొందరు వ్యక్తులు రహస్యంగా పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారంతో అర్థవీడు ఎస్.ఐ. గారు మరియు వారి సిబ్బంది మెరుపు దాడి నిర్వహించారు.పోలీసుల రాకను గమనించి పారిపోయే ప్రయత్నం చేసిన ఆరుగురు (6) నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుండి జూదానికి ఉపయోగిస్తున్న రూ. 27,000/- నగదును మరియు పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరిస్తూ.. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, జూదం వంటి వ్యసనాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పట్టుబడిన నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.