తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజా శాంతి భద్రతలను కాపాడడం మరియు అసాంఘిక కార్యకలాపాలను అరికట్టే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు ఓపెన్ డ్రింకింగ్ ప్రదేశాలపై ప్రత్యేక క్లీనింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్ట విరుద్ధమని ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఓపెన్ డ్రింకింగ్ జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి శుభ్రం చేయడం జరుగుతోంది. అలాగే భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా సంబంధిత వ్యక్తులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.పోలీసులు మాట్లాడుతూ, ఓపెన్ డ్రింకింగ్ వల్ల సామాజిక సమస్యలు, గొడవలు, రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని, ప్రజలు చట్టాలను గౌరవిస్తూ శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ తరహా క్లీనింగ్ డ్రైవ్‌లు జిల్లావ్యాప్తంగా కొనసాగుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.