తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరు పట్టణంలో చెందిన BR OXFORD IIT& MEDICAL ACADEMY కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన షేక్ షాజియా 466/470 మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించింది.అయితే షాజియా తండ్రి ఆజామ్ వలి కందుకూరు లో వృత్తి రీత్యా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారు కాగా.. షాజియా పదవతరగతి కందుకూరు లోని (ZPHS GIRLS) బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదవటం గర్వనీయం.ఈ సందర్భంగా ఆ విద్యార్థిని ని శుక్రవారం ప్రభుత్వ పాఠశాల సిబ్బంది మరియు BR OXFORD విద్యా సంస్థల యాజమాన్య సిబ్బంది కలిసి ఘనంగా సత్కరించారు. అనంతరం బిఆర్ ఆక్స్ఫర్డ్ యాజమాన్య సిబ్బంది ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి 10000/- ఆర్థిక సాయం అందించారు.ఈ సందర్భంగా షాజియా మాట్లాడుతూ..చిన్నప్పటి నుంచే తల్లి,దండ్రుల కష్టం చూస్తూ పెరిగానని,కస్టపడి చదివి తన తల్లి,తండ్రులకి, ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించినట్లు పేర్కొంది.అలాగే తనకి ఇంటర్ లో మంచి మార్కులు రావడానికి కళాశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహం, వారు ఇచ్చిన ప్రోద్బలం మరువలేనదని కొనియాడింది. భవిష్యత్తులో ఇంకా బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదిగి తన తల్లి,దండ్రుల కలలను నిజం చేయాలని ఆశాభావం వ్యక్తం చేసింది.ఈ కార్యక్రమంలో ZPHS GIRLS ప్రధానోపాధ్యాయురాలు ద్వారకా రాణి, ఉపాధ్యాయులు-సుబ్బరత్నం, మురళీకృష్ణ, మహల్యారావు,రోజ్ లీల, గీత, పలువురు ఉపాధ్యాయ సిబ్బంది మరియు BR OXFORD విద్యాసంస్థల చైర్మన్ ఉన్నం భాస్కరరావు, కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్స్ జి.బాల భాస్కరరావు, బి.నరేంద్ర బాబు,ప్రిన్సిపాల్ అబ్బూరి వెంకటేశ్వర్లు,పలువురు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొని ఆ విద్యార్థిని ని అభినందించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *