తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఆత్మ రక్షణపై ప్రతి ఒక్క విద్యార్థినికి అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్., ఆదేశాల మేరకు ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ అధికారులు పాఠశాలలు/కళాశాలలు విద్యార్థినిలకు ఆత్మరక్షణ గురించి నిపుణులైన శిక్షకులతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆత్మ రక్షణలో భాగంగా శత్రువుల నుండి తమను తాము ఎలా రక్షించు కోవాలో సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పించారు. ఈ సందర్బంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని, మహిళలపై దాడి జరిగే సమయంలో తమను తాము రక్షించుకోవడం చాలా అవసరమన్నారు. సెల్ఫ్ డిఫెన్స్ అంటే కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు, అనుకూల, ప్రతికూల సమయాల్లో ఎవరైనా దాడికి పాల్పడితే ప్రతిస్పందించే సామర్థ్యాన్ని పెంచుకోవడమన్నారు. సెల్ఫ్ డిఫెన్స్ మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని , మహిళలను శారీరకంగా, మానసికంగా బలంగా చేస్తుందన్నారు. మహిళలకు తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను అందిస్తుందన్నారు. ఈ సెల్ఫ్ డిఫెన్స్ ప్రతి మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు.మహిళా చట్టాలు, ఫోక్సో ఆక్ట్, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, గుడ్ టచ్ బాడ్ టచ్, సామాజిక మాధ్యమాలు మరియు సైబర్ క్రైమ్స్ పై తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకొని ఉండాలని, బాలికలు తప్పనిసరిగా స్వీయ రక్షణ కలిగి ఉండాలని, ఎదుటివారి నుండి తమను తాము రక్షించుకోవడం నేర్చుకోవాలని తెలిపారు.మహిళలు/చిన్నారులకు అత్యవసర సమయంలో సహాయం కొరకు హెల్ప్‌లైన్ నెంబర్లకు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలన్నారు. చైల్డ్ హెల్ప్ లైన్:1098, ఉమెన్ హెల్ప్ లైన్:181, పోలీస్ హెల్ప్ లైన్:100 / 112, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్:1930, పోలీస్ కంట్రోల్ రూమ్: 9121102266 అని తెలియజేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *