తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, అడిషనల్ యస్.పి.(అడ్మిన్) సూచనల మేరకు, శక్తీ బృందాలచే జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాటశాలలలో చదువుతున్న పిల్లలలో అవగాహన కార్యక్రమాలు పెంపొందించడం.ఆపరేషన్ చిన్నారి తల్లి’ అనేది ఆంధ్రప్రదేశ్ పోలీసులు పిల్లలపై జరిగే లైంగిక నేరాలను అరికట్టడానికివారి భద్రతను పెంపొందించడానికి ప్రారంభించిన ఒక ప్రత్యేక రాష్ట్రస్థాయి డ్రైవ్. “సురక్షిత బాల్యం – స్థిరమైన అభివృద్ధి” అనే నినాదం తో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది.దీని ఉద్దేశం పిల్లలపై జరిగే నేరాలను నిరోదించడం, నేరస్తులని కటినంగా శిక్షించడం.లైంగిక నేరస్థులుఅలవాటుగా నేరాలు చేసేవారు, డ్రగ్స్ వాడేవారుమరియు పిల్లలకు హాని కలిగించే అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా మరియు కఠిన చర్యలు తీసుకుంటారు.లైంగిక నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించిరాత్రి వేళల్లో గస్తీ పెంచుతారు.దాని ఉపయోగాలు, బాల్య వివాహాలు, బాల కార్మిక, వెట్టిచాకిరీ వ్యవస్థలు, మానవ అక్రమ రవాణా, ఫోక్సో యాక్ట్, మాదకద్రవ్యాల నిషేధం, డయల్ 100, 112, 1098, 1930 మొదలగు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు .