తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణ మరియు మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా పలు ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు.ఈ క్రమంలో కొమరోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాజీ నగర్ ప్రాంతంలో సీఐ గారి పర్యవేక్షణలో రాచర్ల ఎస్‌ఐ మరియు పోలీస్ సిబ్బంది కలిసి కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టారు. అలాగే త్రిపురాంతకం మరియు పెద్దారవీడు పోలీస్ స్టేషన్ల సిబ్బంది త్రిపురాంతకం మండలంలోని నాగరాజు కాలనీలో విస్తృత తనిఖీలునిర్వహించారు.పోలీసులు ప్రాంతాలను పూర్తిగా చుట్టుముట్టి ప్రతి ఇల్లు, అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కొత్తగా వచ్చిన వ్యక్తుల వివరాలను సేకరించి, పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచారు. గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల నిల్వ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు చేపట్టారు.ఇలాంటి ఆకస్మిక కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ల ద్వారా నేరాలను అరికట్టడమే కాకుండా, సమాజంలో భద్రతా వాతావరణాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారు. పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేసి, ప్రతి ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడేందుకు కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పోలీసులు పిలుపునిచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *