తొలి శుభోదయం న్యూస్ గుంటూరు:-

గుంటూరులోని జెకేసి రోడ్డులో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ కొండపల్లి నాగేశ్వరరావు, శివాని దంపతులను ఆమె అభినందించారు.విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ చూపించే విద్యాసంస్థలు తప్పకుండా ఉన్నత స్థాయికి చేరుకుంటాయని ఆమె పేర్కొన్నారు. నరసరావుపేటలో ఇప్పటికే మంచి పేరు సంపాదించిన ఈ సంస్థ గుంటూరులో కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.రాజధాని అభివృద్ధిలో భాగంగా గుంటూరులో ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించడం ఎంతో కీలకమని, విద్య ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధ్యమని ఆమె తెలిపారు. గుంటూరు విద్యకు కేంద్రంగా నిలుస్తూ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు అంతర్జాతీయ స్థాయి పాఠశాలలకు కూడా కేంద్రంగా ఎదుగుతుందని పేర్కొన్నారు.విద్యతో పాటు విలువలు కూడా విద్యార్థులకు అందించడం అవసరమని, వ్యసనాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టేలా పాఠశాలలు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. పల్నాడు ప్రాంతానికి చెందిన కొండపల్లి దంపతులు ఈ స్థాయి విద్యాసంస్థను ప్రారంభించడం గర్వకారణమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, భాష్యం, భాష్యం ప్రవీణ్, గోనుగుంట్ల కోటేశ్వరరావు, సామినేని కోటేశ్వరరావు, గోరంట్ల బొచ్చే చౌదరి, మన్నెం మల్లిబాబు, తాడిశెట్టి మురళి, కార్పొరేటర్ బాలాజీ, భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *