తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా, న్యాయంగా నిర్వహించబడేలా చర్యలు తీసుకునే క్రమంలో ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు వివిధ ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను సందర్శించారు.ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల్లో ఉన్న భద్రతా ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు, ప్రవేశ నియంత్రణ, పర్యవేక్షణ ఏర్పాట్లు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, పరీక్ష నిర్వహణ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.విద్యార్థులు భయభ్రాంతులకు గురి కాకుండా సురక్షిత వాతావరణంలో పరీక్షలు రాయేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *