తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీసుల :-
ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో, విద్యార్థులు ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.ముఖ్యంగా పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తూ, గుంపులుగా ఉండేవారిని చెదరగొడుతున్నారు. కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మాస్ కాపీయింగ్ వంటి అక్రమాలకు తావులేకుండా సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా, పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేసి నిఘా పెంచారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ, వారు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.