తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
జిల్లావ్యాప్తంగా నేటి నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పురస్కరించుకుని, విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి లేదా ఆందోళన లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ముందస్తుగా భారీ పోలీస్ బందోబస్తును మోహరించారు.పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎవరూ గుంపులుగా ఉండకూడదని అధికారులు స్పష్టం చేశారు. అక్రమాలకు తావులేకుండా పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించి, అనుమానితులపై నిరంతరం నిఘా ఉంచారు. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సివిల్ మరియు ఏఆర్ (AR) పోలీస్ బలగాలతో నిరంతర పహారా నిర్వహిస్తున్నారు. “విద్యార్థుల ప్రశాంతతే మా ప్రాధాన్యత” అని తెలుపుతూ, పరీక్షల పారదర్శకతను కాపాడడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు పోలీస్ యంత్రాంగం వెల్లడించింది.