పరీక్షల పట్ల భయం పోగొట్టేలా విద్యార్థుల్లో ధైర్యం నింపిన మంత్రి
జేఈఈ మెయిన్స్ లో అర్హత సాధించిన 161 మంది విద్యార్థులకు మంత్రి డా.స్వామి అభినందనలు
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంబేద్కర్ గురుకులాల విద్యార్థులు 161 మంది జేఈఈ మెయిన్స్ లో అర్హత
తొలి శుభోదయం న్యూస్ అమరావతి : –
పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా, ధైర్యంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సూచించారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో గురువారం నాడు తాడేపల్లిలోని APSWREIS కార్యాలయంలో అంబేద్కర్ గురుకులాల ఇంటర్ విద్యార్థులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన మంత్రి పరీక్షల పట్ల భయం పోగొట్టేలా విద్యార్థుల్లో ధైర్యం నింపారు. ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షల్లో అందరూ ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. పరీక్షల సమయంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అనంతరం జేఈఈ మెయిన్స్ లో అర్హత సాధించిన 161 మంది విద్యార్థులను మంత్రి స్వామి అభినందించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంబేద్కర్ గురుకులాల విద్యార్థులు 161 మంది జేఈఈ మెయిన్స్ కి అర్హత సాధించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహం వల్లే గతేడాది కంటే 3 మూడు రెట్లు ఎక్కువ మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ కు అర్హత సాధించారని తెలిపారు. గతేడాది ఐఐటీ, నీట్ లో సీట్లు సాధించిన 57 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సాహం అందించామని మంత్రి తెలిపారు. పేద పిల్లలు ఇంజనీర్లు,డాక్టర్లు కావాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. పేద విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం ఎంత ఖర్చునైనా భరించి వారిని అన్ని విధాల ప్రోత్సహిస్తుందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో APSWREIS కార్యదర్శి IAS వి. ప్రసన్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
