తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలోని 7వ వార్డు విక్కిరాలపేట రోడ్డులో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ రూబీ గారి నివాసంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నాను.ఈ సందర్భంగా రూబీ కుటుంబ సభ్యులు మరియు ముస్లిం సోదరులు ఆత్మీయంగా స్వాగతం పలికారు. ముస్లిం సోదర సోదరీమణులను, చిన్నారులను స్నేహపూర్వకంగా పలకరించాను.
అహ్మద్ వలి ఆధ్వర్యంలో దువా నిర్వహించగా, పవిత్ర రంజాన్ ఉపవాస సమయంలో అల్లాహ్ అందరినీ చల్లగా చూడాలని ప్రార్థించాను. అలాగే అందరికీ ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశాను.రూబీ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ ఇఫ్తార్ విందులో పాల్గొన్నాను.