తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం పట్టణం నందు ఈ నెల 25న బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక సాయి బాలాజీ స్కూల్ ఎదురుగా నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు భారీగా ప్రజలు తరలిరావాలని జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ప్రజానికానికి పిలుపునిచ్చారు.
మార్కాపురం పట్టణంలోని పలు వార్డులలో గడప గడప ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి, నేడు జరగబోయే సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పిన్నెబోయిన శ్రీనివాసులు, షేక్ ఖాసిం వలి, మట్టం శ్రీనివాసులు, బట్టగిరి మురళీధర్ రెడ్డి, శివ సింగ్, ఇ.పిచ్చయ్య, ఎన్డీఏ కూటమి టీడీపీ నాయకులు షేక్ గఫార్, మేడికొండ వెంకటేశ్వర్లు, మహమ్మద్, ప్రసాద్, నరసింహ, మేడిక ఆంజనేయులు, బాజి, కరీమ్ భాషా, ఖాన్ భాషా మరియు తదితరులు పాల్గొన్నారు.