తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

రాష్ట్రంలోని ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కొరకు బహుజన టీచర్స్ అసోసియేషన్ బిటిఏ ఇచ్చిన దశలవార పోరాటంలో భాగంగా ప్రజాప్రతినిధులకి వినతి పత్రాలు ఇవ్వాలి అనే కార్యక్రమంలో భాగంగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుని కలిఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారము కొరకు కృషి చేయాలని కోరడమైనది.12వ పిఆర్సి కమిషన్ వెంటనే నియమించాలని పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే మంజూరి చేయాలని రోలు తక్కువని నెపంతో పాఠశాలలు మూసి వేయరాదని నియామకాలుగాని ప్రమోషన్స్ గాని రోస్టర్ కం మెరిట్ పద్ధతిలోనే నియమించాలని వినతిపత్రం ఇవ్వడమైందిఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మోహన్ రావు జిల్లా అధ్యక్షులు అబ్దుల్లా డివిజన్ అధ్యక్షులు రమణయ్య కందుకూరు మండల శాఖ అధ్యక్షులు కోటేశ్వరరావు నాయకులు సుబ్రహ్మణ్యం కొండలరావు కోటయ్య మాలకొండయ్య అంజయ్య భగత్ సింగ్ మొదలగువారు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *