తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రజల్లో చట్టపరమైన అవగాహన పెంపొందించి, నేరాల నివారణకు ముందస్తు చర్యలుగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఉలవపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌత్ బైపాస్ రోడ్ జంక్షన్ వద్ద రోడ్డు భద్రత, సైబర్ మోసాలు మరియు పోక్సో చట్టంపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరింపు ప్రాముఖ్యత, వేగ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల పాటింపు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.అదేవిధంగా పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ఓటీపీ మోసాలు, ఫిషింగ్ లింకులు, నకిలీ లోన్ యాప్‌లు, సోషల్ మీడియా మోసాలపై ప్రజలను అప్రమత్తం చేశారు. తమ వ్యక్తిగత మరియు బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని, ఏదైనా సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.పిల్లల రక్షణకు సంబంధించిన పోక్సో చట్టంపై కూడా తల్లిదండ్రులకు మరియు ప్రజలకు అవగాహన కల్పించారు. చిన్నారులపై జరిగే లైంగిక దాడులు, వేధింపులపై వెంటనే ఫిర్యాదు చేయాలని, పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత సమాజం నిర్మాణం సాధ్యమని, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *