తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు నుంచి చుట్టుగుంట వెళ్లే రోడ్డులో పల్లెవాగుపై పురాతన కల్వర్టు సోమవారం రాత్రి కుంగిపోయింది. 35 సంవత్సరాల క్రితం నిర్మించిన కల్వర్టు పైపులు పగిలిపోయి గుంత ఏర్పడింది. దీంతో కందుకూరు నుంచి చుట్టుగుంట మీదుగా ఉలవపాడుకు రాకపోకలు నిలిచిపోయాయి. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు … రాకపోకలు కొనసాగే విధంగా, కల్వర్టుకు ఏర్పడ్డ గుంత పూడ్చాలని మున్సిపల్ కమిషనర్ అనూష ను ఆదేశించారు. దీంతో అధికారులు మట్టితో తాత్కాలికంగా మరమ్మత్తులు చేశారు. కల్వర్తును పూర్తిగా మట్టితో పూడ్చడంతో రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి. ఎమ్మెల్యే స్పందించిన తీరు పట్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తంచేశారు.