తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
నగరంలోని కేశవస్వామిపేట వద్ద శ్రీప్రసన్న చెన్న కేశవ స్వామి ఆలయంలో జాతీయ పురస్కార వేడుకలు ఎస్ ఎల్ సి పి ఎస్ కళానిలయము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆధ్యాత్మీక సేవా సంస్థ ఆద్వరoలో అత్యంత వైభవంగా సోమవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి సంస్థ సెక్రటరీ కె.బుచ్చైశ్వర్ రావు అధ్యక్షత వహించారు ఈ వేడుకలకు సేవా పురస్కారం అందుకున్న సామాజికవేత్త , సీనియర్ జర్నలిస్ట్ కంచర్ల మల్లికార్జున రావు మాట్లాడుతూ సేవా సంస్థ సెక్రెటరీ బుచ్చైశ్వర్ రావు భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలనునిర్వహించాలని సూచించారు. ఆయనకు ఆరోగ్య ,ఐశ్వర్యంలను ప్రసాదం చాలని చెప్పారు. పలువురిని సన్మానించారు.ఈ కార్యక్రమంలో మానవ హక్కుల పరిరక్షణ కమిటీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కే శృతి,.నేషనల్ డైరెక్టర ఇండస్ట్రియల్ రిలేషన్స్ వర్కర్స్ బోర్డ్. షేక్ సిద్ధాంబి కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ . కొలకలూరి రవిబాబు, సెక్రెటరీ బుచ్చేశ్వర్ రావు, వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ జాతీయ ఉపాధ్యక్షురాలు డాక్టర్ కే శృతి, నేషనల్ డైరెక్టర్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ వర్కర్స్ బోర్డ్ సిద్ధాంబి , ఐసిడిఎస్ సిడిపిఓ,కళ్యాణి వర్మ., ఒంగోలు భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటరమణ, డాక్టర్ మద్దాలి మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.