తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-

ఒంగోలు నగరాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు. నగర ముఖచిత్రాన్ని మార్చేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రామాయపట్నం పోర్ట్, బీపీసీఎల్, జిందాల్ వంటి భారీ పెట్టుబడులతో అభివృద్ధి వేగం పెరుగుతున్న నేపథ్యంలో ఒంగోలును ఆధునికంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే చర్యలు ప్రారంభమయ్యాయి. రిక్రియేషన్ సెంటర్లు, సెంట్రల్ పార్క్, ట్రంక్ రోడ్ విస్తరణ, పార్కింగ్ సౌకర్యాల పెంపు, ఆధునిక టాయిలెట్లు, డిజిటల్ డిస్ప్లేలు వంటి అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. నగర ప్రవేశ, వీడ్కోలు జంక్షన్లను ప్రత్యేకంగా అభివృద్ధి చేయనున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *