తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు, కందుకూరు పట్టణం 6వ వార్డులో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 6వ వార్డు ఆర్డిఓ ఆఫీస్ ఎదుట టిడిపి జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.ఈ సందర్భంగా పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు గారి సేవలను ఘనంగా స్మరించుకుంటూ “జోహార్ ఎన్టీఆర్…అంటూ నినాదాలతో ప్రాంతం మారుమోగింది. ఎన్టీఆర్ గారి ప్రజా సేవ, స్వాభిమానం, తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకత్వాన్ని నేతలు కొనియాడారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి పార్టీ శ్రేణులు ఆనందాన్ని పంచుకున్నారు. కార్యకర్తల్లో కనిపించిన ఉత్సాహం, ఐక్యత పార్టీ భవిష్యత్తుకు మరింత బలం చేకూర్చుతుందని నాయకులు పేర్కొన్నారు. “ఎన్టీఆర్ చూపిన మార్గంలోనే ముందుకు సాగుతూ ప్రజల కోసం కట్టుబడి పనిచేస్తాం” అని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో 6వ వార్డు టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *