తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా కందుకూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగం మండలం, కీసరగుంట కాలనీలో జరుగుతున్న అక్రమ జూదంపై పోలీసులు కీలక దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం తక్షణమే చర్యలు చేపట్టి, జూదంలో పాల్గొంటున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.ఈ దాడిలో భాగంగా రూ. 9,330 నగదు, 9 మొబైల్ ఫోన్లు మరియు 5 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాంతంలో అక్రమ కార్యకలాపాలను అరికట్టడంలో భాగంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.నిందితులపై చట్టపరమైన కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. అక్రమ జూదం వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఇటువంటి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేయబడింది.