తొలి శుబోదయం న్యూస్ :-
రేణమాల అయ్యన్నను కులం పేరుతో దూషించి భౌతిక దాడికి ప్రయత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కందుకూరు పట్టణ ఎస్.ఐ పులి శివనాగరాజుకు ఫిర్యాదు చేయగా..దాడికి ప్రయత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ విషయంపై కోటి మాదిగ మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీ అయినా దళితులపై ధాడులు జరిగినప్పుడు స్పందించే తీరు చాలా బాధాకరంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కందుకూరు నియోజక వర్గ కార్యాలయంలో తేది: 07-10-2025 న నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ గారి సమక్షంలోనే పార్టీ మీటింగ్ లో తన సొంత కులానికి చెందినవారు కులం పేరుతో దూషించి ధాడికి ప్రయత్నం చేసిన సంఘటన తన సమక్షంలో జరిగింది.కులం పేరుతో దూషణ చేసి ధాడికి ప్రయత్నం చేసినా సరే, ఆయన సొంత కులం వారిని కాపాడుకునే క్రమంలో మాట్లాడక పోయినప్పటికీ, పార్టీలో ఉన్న కార్యకర్తకు అన్యాయం జరిగినప్పుడు ఖండించి సమస్యను పరిష్కరించే బాధ్యత నియోజకవర్గ ఇన్చార్జ్ అయినటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ గారిపై ఉందని ఆయన అన్నారు. మరుసటి రోజు తేది: 08-10-2025 న అంకమ్మ దేవాలయం దగ్గర అయ్యన్న ఉన్న సమయంలో అతని వద్దకు వెళ్లి ముందు రోజు జరిగిన ఘటన మనసులో ఉంచుకొని ఉద్దేశ్యపూర్వకంగా కులం పేరుతో దూషించి చొక్కా కాలర్ పట్టుకుని లాగి దాడికి ప్రయత్నించాడు.
ఇలాంటి సంస్కృతి ఉన్న వ్యక్తులపై పోలీసులు ,ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అయ్యన్నను దుర్భాషలాడి దాడికి ప్రయత్నం చేసి తన ఆత్మ గౌరవానికి భంగం కలిగించిన మల్లె బోయిన రామారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అయ్యన్నకు న్యాయం జరిగే వరకూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో అండగా నిలబడతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కో – కన్వీనర్ అత్యాల శరత్ మాదిగ, కందుకూరు నియోజక వర్గ ఇన్చార్జి గౌడపేరు కృష్ణ మాదిగ, కొండపి నియోజకవర్గ ఇన్చార్జి రేణమాల మాధవ్ మాదిగ, కందుకూరు మండల అధ్యక్షులు గౌడపేరు మహేష్ మాదిగ, రావినూతల వెంకటేష్ మాదిగ, ముట్లూరి మోజేష్ మాదిగ, పోణుగోటి ఉదయకుమార్ మాదిగ, సూరపోగు మోజేష్ మాదిగ, బుడంగుంట్ల మనోహర్ మాదిగ, ఇజ్రాయేల్, తదితరులు పాల్గొన్నారు.