తొలి శుభోదయం న్యూస్ కొండ బిట్రగుంట,:-

నెల్లూరు జిల్లా,బోగోలు మండలం కొండ బిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సూర్యప్రభ వాహన సేవను ఆలయ అధికారులు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి వాహన సేవను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో కళకళలాడింది. “గోవింద గోవింద” నామస్మరణల మధ్య స్వామివారి సూర్యప్రభ వాహన సేవ ఘనంగా సాగింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *