తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుంటుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తెలిపారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ గిద్దలూరు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో సరైన రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న వెంటనే ప్రభుత్వo దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి ఆర్ & బీ రోడ్ల మరమ్మత్తుల కోసం రూ.5.60 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.