తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలంలో ఎటువంటి పెట్రోల్ కొరత లేదని తహసిల్దార్ ఆంజనేయ రెడ్డి అన్నారు. డీజిల్ వరకు కొంతవరకు కొరత ఉన్న రేపటికల్లా అది పరిష్కారం అవుతుందని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలతో ప్రజలు ఆందోళన చెంది పెట్రోల్, డీజిల్ కోసం భారీగా తరలిరావడం కొందరు ముందస్తు జాగ్రత్తతో మరికొందరు బ్లాక్ మార్కెట్లో సొమ్ము చేసుకోవాలన్న ఆరాటంతో పెట్రోల్ డీజిల్ అదనంగా కొనుగోలు చేస్తున్నారని తహసిల్దార్ వెల్లడించారు.
వ్యవసాయానికి డీజిల్ అవసరమైన వారు సంయుక్త శాఖ వారి వద్ద నుంచి సర్టిఫికెట్ తెచ్చుకుంటే డీజిల్ పోయాలని పెట్రోల్ బంకుల యాజమాన్యాలకు తెలియజేయడం జరిగిందన్నారు. పెట్రోల్ డీజిల్ లేదని కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని పెట్రోల్ బంకుల నిర్వహకులకు తెలిపినట్లు తహసిల్దార్ ఆంజనేయ రెడ్డి అన్నారు.