తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:-
సమాజంలో పేదరికంలో జీవిస్తున్న గిరిజన బిడ్డలకు విద్య, ఉజ్వల భవిష్యత్తు అని కావలి లోక్ అదాలత్ సభ్యులు యం.మాలకొండ రెడ్డి పేర్కొన్నారు. గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలోని గిరిజన గురుకుల ఆశ్రమ ఉన్నత పాఠశాల ఆవరణంలో శుక్రవారం విద్యార్థులకు విద్య యొక్క ఆవశ్యకతపై అవగాహన సదస్సు నిర్వహించినారు. మాలకొండ రెడ్డి మాట్లాడుతూ గిరిజనులు అభివృద్ధికి దూరంగా పేదరికంలో జీవిస్తున్నారని వారు తలరాతలు మారాలంటే వారి బిడ్డలు పాఠశాలలో చేరి విద్యను అభ్యసించడం ద్వారా సమాజంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని తెలిపినారు విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం తల్లిదండ్రులు బిడ్డలను పాఠశాలలకు తప్పనిసరిగా పంపాలని కోరారు, అదేవిధంగా బాల్య వివాహాల నిషేధ చట్టంపై తల్లి దండ్రులు మరియు విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మద్దూరు పాడు గ్రామ మాజీ సర్పంచ్ రావులకొల్లు బాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు బడి బయట తిరక్కుండా, బాల కార్మికులుగా మారకుండా గురుకుల ఆశ్రమ పాఠశాలలో చిన్నారులను చేర్పించి విద్యాబుద్ధులు నేర్పించాలని తల్లిదండ్రులను కోరారు.ఈ కార్యక్రమానికి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆదిలక్ష్మి అధ్యక్షులుగా వహించి మాట్లాడుతూ విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకుని, వారి జీవితాలు ఉన్నత విద్య దిశగా అడుగులు వేసి జీవితంలో ఎదగాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.