తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

నెల్లూరు జిల్లా కల్చరల్ వింగ్ జిల్లా అధ్యక్షులు కంపరాజు సాంబశివరాజు అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం ఇంటిదగ్గర ఉన్న సాంబశివరాజును బుర్రా మధుసూదన్ యాదవ్ పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మధుసూదన్ యాదవ్ పరామర్శ అనంతరం సాంబశివరాజు తుది శ్వాస విడిచారు ఆయన మరణం పార్టీకి తీరని లోటని, ఆవేదన మిగిలించిందని ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ తెలిపారు. ఆయన విడిచి వెళ్లిన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సాంబశివరాజు ఆత్మకు ఆ భగవంతుడు శాంతిని కలుగచేయాలని ఆకాంక్షించారు.స్వర్ణాజిపురం గ్రామ వాస్తవ్యులు పాలిచర్ల. చిట్టిబాబు, సోని, చైతన్య కుమార్, అవంతిక, మద్దిరాల బుజ్జమ్మ అనువారలు ఈ మధ్యకాలంలో ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స అనంతరం కోలుకొని ఇంటికి వచ్చారు వారిని బుర్రా మధుసూదన్ యాదవ్ పరామర్శించినారు. స్వర్ణాజిపురం గ్రామ వాస్తవ్యులు జలదంకి ఏసేబు, కొత్తపేట వాస్తవ్యులు జాజుల శ్రీను అనువారులు హార్ట్ ఎటాక్ తో మరణించగా వారి కుటుంబాలను పరామర్శించి ధైర్య వచనాలు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *