తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
గురుకుల నిర్వహించనున్న 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్షకు హాజరుకానున్న
బింగినపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు పోటీ పరీక్ష ఎలా రాయాలో అవగాహన కల్పించేందుకు శనివారం న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మాక్ టెస్ట్ నిర్వహించారు.
విద్యార్థులు పరీక్ష విధానం, ప్రశ్నాపత్ర రూపకల్పన, సమయ నిర్వహణపై స్పష్టత పొందేలా ఈ మాక్ టెస్ట్ ఏర్పాటు చేయబడింది.పరీక్ష హాల్‌లో పాటించాల్సిన నియమాలు, ఓఎంఆర్ షీట్ నింపే విధానం, సమయాన్ని సమర్థవంతంగా వినియోగించే పద్ధతులపై ప్రధానోపాధ్యాయులు అంబటి బ్రహ్మయ్య ప్రత్యేకంగా మార్గదర్శకత్వం అందించారు. అదేవిధంగా ఎలిమినేషన్ పద్ధతిలో మనకి సమాధానం తెలియని ప్రశ్నలకు ఎలా సమాధానం రాబట్టాలో తెలిపారుఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ఉత్సాహంగా పరీక్ష రాసి తమ సన్నద్ధతను మెరుగుపరుచుకున్నారు.ఇలాంటి మాక్ పరీక్షలు విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో ఎంతో ఉపయోగకరమని తల్లిదండ్రులు మరియు ఆ పాఠశాల ఉపాధ్యాయులు మాలిరావు అభిప్రాయపడ్డారు.
రేపటి ప్రధాన ప్రవేశ పరీక్షను విద్యార్థులు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో రాయాలని సూచించారు.