తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-

ఒంగోలు నగరంలోని ప్రధాన వాణిజ్య మరియు వినోద కేంద్రమైన గోరంట్ల మల్టీప్లెక్స్ థియేటర్ రోడ్డు ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌ను నిర్వహించారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ పి.ఎస్. ఆర్‌.ఎస్‌.ఐ. శివ ప్రసాద్ (RSI Shiva Prasad) గారి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఈ తనిఖీలు చేపట్టారు. రహదారికి ఇరువైపులా ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వారిని హెచ్చరిస్తూ, అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాల సామాగ్రిని తొలగించారు.ముఖ్యంగా సినిమా థియేటర్ వద్ద రహదారిపై అడ్డదిడ్డంగా వాహనాలు నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు. పాదచారులు మరియు వాహనదారులు ఇబ్బందులు పడకుండా రోడ్డును క్లియర్ చేసిన అధికారులు, వ్యాపారులు తమ వస్తువులను రహదారిపై ఉంచకుండా చూసుకోవాలని సూచించారు. “ప్రజల ప్రయాణం సుఖమయంగా ఉండడమే మా ప్రాధాన్యత” అని, ఆక్రమణలు పునరావృతమైతే భారీ జరిమానాలు మరియు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్.ఎస్.ఐ. శివ ప్రసాద్ గారు స్పష్టం చేశారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా చేపట్టిన ఈ చర్య పట్ల నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *