తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:-

గుడ్లూరు మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో పాల్గొని, ప్రజల నుండి నేరుగా వినతులు స్వీకరించడం జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో రీ-సర్వే వల్ల తలెత్తిన రెవెన్యూ ఇబ్బందుల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి సారించాము. ఈ సందర్భంగా 31 శాఖల అధికారులకు గాను కేవలం 8 మంది మాత్రమే హాజరుకావడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించాను.
గత మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని, ప్రతి సోమవారం గ్రీవెన్స్‌కు అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవాలని అధికారులను ఆదేశించాను. అర్జీదారుల సమస్యలను సకాలంలో పరిష్కరించి వారిలో నమ్మకాన్ని కలిగించడమే మన బాధ్యత.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *