తొలి శుభోదయం ఒంగోలు:-
ప్రకాశం జిల్లా ఒంగోలు, సంతమాగులూరు మండలం, ఏల్చూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరియు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు సుమారుగా 500 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ప్రయాణ భారంతో ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ సంకల్పం. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నేడు ప్రభుత్వ స్కూళ్లలో వసతులు కల్పిస్తున్నారు.