తొలి శుభోదయం సింగరాయకొండ:-

శానంపూడి గ్రామానికి చెందిన ఉన్నం కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా మానవతా దృక్పథంతో వృద్ధులు, నిరాశ్రయులు, బస్టాండ్లలో ఉండేవారు, రైల్వే స్టేషన్ పరిసరాల్లో నివసించే వారు, అలాగే జాతీయ రహదారి వెంట ఉన్న యాచకులకు దుప్పట్లు పంపిణీ చేసే సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.చలికాలంలో నిరాశ్రయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని గమనించి, వారికి కొంత ఉపశమనంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సింగరాయకొండ అప్డేట్స్ యువత చెన్నంచెట్టి హరి తెలిపారు.చలికాలంలో వయోవృద్ధులను చిన్నారులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉన్నం కార్తీక్ తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారని,ఈ సంవత్సరము చలి ఎక్కువ ఉన్నదని,దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేద్దామని చెప్పిన వెంటనే కార్యక్రమానికి సహకరించారని తెలియజేశారు.ఈ సందర్బంగా కార్తీక్ తల్లిదండ్రులు సమాజంలో అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *