తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో సింగరాయకొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుమల్లి ఎక్స్ క్రాస్ రోడ్డు వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రెండు చక్రాల వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, అధిక వేగంతో వాహనాలు నడపకూడదు, మద్యం సేవించి వాహనం నడపరాదని, రాంగ్ రూట్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అలాగే రాత్రి సమయంలో ప్రతిబింబించే స్టిక్కర్లు వాడటం, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.ఈ సందర్భంగా సింగరాయకొండ సీఐ మాట్లాడుతూ, చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీస్తుందని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించి రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.