తొలి శుభోదయం న్యూస్ :-

పోలీస్ శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక అతి ఉత్కృష్ట సేవా పథకం జిల్లావాసికి లభించింది. జిల్లాలోని సోమశిల కు చెందిన వేలమూరి శ్రీరామ్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఫర్ ది ఔట్ స్టాండింగ్ ఇన్ ఇంటలిజెన్స్ ఇన్ 2025 పురస్కారం సాధించారు. ప్రకాశం జిల్లా ఇంటెలిజెన్స్ విభాగంలో ఆర్ఐఓ.. జోనల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీరామ్ పోలీస్ శాఖలోనే కానిస్టేబుల్ గా పని చేసిన కృష్ణమూర్తి – వరలక్ష్మ కుమారుడు. కలువాయి.. సోమశిల.. నెల్లూరులలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన కానిస్టేబుల్ గా ప్రస్థానం మొదలుపెట్టారు. గ్రేహౌండ్స్ లో ప్రతిభ చూపి సివిల్ ఎస్సైగా ఎంపికైన శ్రీరామ్ ప్రకాశం జిల్లాలోని దోర్నాల.. మార్టూరు.. కందుకూరు.. చీరాల రూరల్.. చీమకుర్తి తదితర ప్రాంతాలలో పనిచేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందిన ఆయన పొదిలి… దర్శి.. కందుకూరు తదితర ప్రాంతాలతో పాటు అదే జిల్లాలో విజిలెన్స్.. ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేశారు. రాష్ట్రస్థాయిలో సంచలనం సృష్టించిన పలు కేసులను పరిష్కరించిన శ్రీరామ్ ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ పురస్కారానికి ఎంపిక కావడంపై సర్వత్రా వ్యక్తమవుతోంది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *