తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వ్యర్థాల విభజన మరియు వ్యర్థ రహిత జీవనశైలి అనే ఇతివృత్త ప్రధానంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవి కుమార్ విద్యార్థులకు జీరో వేస్ట్ క్యాంపస్ అనే అంశంపై అవగాహన కలిగించే విధంగా కొన్ని సూచనలు అందించారు. వ్యర్ధాలను కలపకుండా తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా ఉంచేలా చర్యలు తీసుకోవడం చాలా అవసరమని తెలియజేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి స్టీల్ బాటిల్స్ వాడడం, గుడ్డ సంచులు వాడడం వంటి విషయాల్లో విద్యార్థులు బాధ్యతాయుతంగా మెలగాలని తెలియజేశారు. క్యాంటీన్ మరియు హాస్టల్ నుంచి వచ్చే ఆహార వ్యర్ధాలను కాలేజీ వర్మీ కంపోస్ట్ యూనిట్లో వేసేలా చర్యలు తీసుకుని, ఈ కంపోస్టును కళాశాల తోటలు మరియు మొక్కల పెంపకం కోసం వినియోగించాలని సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయబడిన క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలో భాగంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్థాలను సేకరించి కళాశాల క్యాంపస్ ని శుభ్రం చేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నరేంద్ర ఏడుకొండలు ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ పి. రాజగోపాల్ బాబు, అకడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎన్ వి శ్రీహరి, వృక్ష శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ ఎన్.తిరుపతి స్వామి తెలుగు అధ్యాపకులు డాక్టర్ కె .సుజాత కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు డాక్టర్ జె .హనుమంతరావు చరిత్ర అధ్యాపకులు డాక్టర్ డి రామాంజనేయులు ఇతర అధ్యాపక సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు
