తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం / తూర్పు నాయుడుపాలెం:-

టీడీపీ కార్యకర్తల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన కొండపి నియోజకవర్గం అనకర్లపూడి గ్రామానికి చెందిన ముప్పరాజు వెంకటరావు కుటుంబ సభ్యులకు టీడీపీ కార్యకర్తల సంక్షేమ భీమా రూ. 5 లక్షల చెక్కును ఆదివారం తూర్పునాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి స్వామి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..టీడీపీ కార్యకర్తల త్యాగాలు వెలకట్టలేనివి. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలే.టీడీపీ కార్యకర్తల కష్టాల్లో యువనేత నారా లోకేష్ అండగా నిలుస్తున్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనివిధంగా కార్యకర్తల సంక్షేమ నిధి తీసుకొచ్చారు.కార్యకర్తలకు ఎప్పుడు ఎక్కడ ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ అండగా నిలుస్తున్నారని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *