తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం జిల్లా కంభం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, క్లబ్ అధ్యక్షులు తన్నీరు బాల రంగారావు, లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్, డాక్టరేట్ పులి శ్రీనివాస ప్రసాద్ ఆర్థిక సహకారంతో, పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న, స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులకు, అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. గత ఏడాది ఈ పాఠశాల విద్యార్థులు, టెన్త్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించడమే కాకుండా, ట్రిపుల్ ఐటీ నందు, అత్యధిక సీట్లను సాధించడంతో, ఇక్కడి విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు క్లబ్ అధ్యక్షులు పేర్కొన్నారు. ప్రతిరోజు సాయంత్రం స్టడీ అవర్ నందు విద్యార్థినులకు అల్పాహారాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు బి.అమూల్య, లయన్స్ సర్వీస్ ప్రోగ్రామ్స్ చైర్మన్ మాజీ జడ్పీటీసీ సయ్యద్ జాకీర్ హుస్సేన్, కోశాధికారి పి.గుండయ్య, ఎన్. కేశవ, గూటూరి సత్య రామారావు, ఉపాధ్యాయులు సిహెచ్ కృష్ణమోహన్, జే పద్మ, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.